India Among Select few Countries Developing Hypersonic Missiles | హైపర్ సోనిక్

Share this & earn $10
Published at : October 25, 2021

ధ్వని కన్నా అనేక రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే హైపర్ సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న అతికొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందని అమెరికా కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. ఈ సాంకేతికత కోసం రష్యాతో చేతులు కలిపినట్లు తెలిపింది. స్వతంత్రంగా వ్యవహరించే కాంగ్రెస్ పరిశోధన సర్వీస్ -CRS ఈ నివేదికను రూపొందించింది. తాజాగా అమెరికా ఒక హైపర్ సోనిక్ క్షిపణి పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించింది. వర్జీనియాలోని వాలాప్స్ లోని కేంద్రంలో ఈ పరీక్ష జరిపింది. సాధారణ హైపర్ సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేయడంలో ఇదో ముందడుగు అని అమెరికా నౌకాదళం పేర్కొంది. ఇందులో అధునాతన సాంకేతికతలను పరీక్షించినట్లు వివరించింది. ఇటీవల చైనా హైపర్ సోనిక్ పరీక్షను నిర్వహించిన నేపథ్యంలో అమెరికా ఈ చర్యకు పూనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- India Among Select few Countries Developing Hypersonic Missiles |  హైపర్ సోనిక్
ETVETVTeluguETV NewsVideo